బ్రాహ్మణులూ భక్తి !

బ్రాహ్మణులకి భక్తి విప్లవం వల్ల వచ్చిన existential crisis ఏమీ లేదు. ఏవో చిన్న చిన్న ఛాలెంజులెదురైనా అవి ఎక్కువ కాలం నిలబడలేదు.

కర్నాటకలో అవైదిక లింగాయతం వచ్చినా, అది బసవుడు బ్రతికుండగానే ఆంధ్రలో స్మార్త శైవంగా మారిపోయింది. ఆ తరువాత అక్కడ కూడా ప్రాభవం తగ్గి స్మార్తం దగ్గరకే చేరింది.

జైన, బౌద్ధ, శైవాలు ప్రబలడం వల్ల బ్రాహ్మణ మతానికి ఆదరణ తగ్గింది అనడానికి శాసనాధారాలు లేవనుకుంటాను. బౌద్ధం పీక్ లో ఉన్నప్పుడు కూడా బ్రాహ్మణులకు చేసిన దాన శాసనాల సంఖ్య పెద్దగా తగ్గలేదు.

బ్రాహ్మణులు యజ్ఞాలు చేసుకునే పూర్వ మీమాంశ కాలంలోనే గ్రామ దేవతలను పరమ భక్తితో కొలుచుకునే జన సామాన్యం యొక్క విశ్వాసం పొందారు.

‘సాములూ, ఇలా వచ్చి మాయమ్మకు కూడా పూచ్చేయ్ సాములూ’ అంటేనే కదా వీళ్ళు వెళ్ళి పెద్దమ్మ తల్లిని వేద మంత్రాల సహితంగా పూజించి స్థళ పురాణాలు అల్లి ఆది పరాశక్తిగా మార్చింది?!

లేదంటే, కొందరు మేధావులన్నట్టుగా బ్రాహ్మలు గ్రామస్థులపై యుద్ధాలు చేసి, వారి గుళ్ళన్నింటినీ ఆక్రమించుకుని, వారి పూజారుల్ని వెళ్ళగొట్టి పెత్తనం చెలాయిచారంటారా?!