‘దేహమే అంతా …. ‘
‘దేహం వల్లే జ్ఞానం. దేహం వల్లే వాసనలు.’
‘ఆ చచ్చిన దేహాన్ని కాల్చి తగలేశాక కూడా ఆ దేహపు భస్మాన్ని, అవశేషాలను పట్టుకు వేళాడటం, వాటి కోసం కొట్లాడటం, దొరికినంత వరకూ పెట్టెలో దాచి, దాని చుట్టూ ఇటుక స్తూపాలు కట్టి పలుకుబడి, రాబడి పెంచుకోవడం ….. ‘
‘దేహమే అంతా …. ‘
‘బుద్ధుని దేహమే అంతా …. ‘
‘దుఃఖం నిజం, మరణం నిజం. కర్మ నిర్వాణాల కద్దు బుద్ధిజం.’
‘మనఃసత్యేన శుద్ధ్యతిః’
శరీరానికి సత్యంతో పనేంటి? జటరాగ్నికి భోజనం. ఋతు ధర్మం మైథునం. కాల ధర్మం మరణం.
ఇక మంచేంటి, చెడేంటి?
ఈ ప్రశ్నలు అడిగే దేహాన్ని ఎదురొడ్డ లేక మనసు, మానవత్వం అనే అసత్యాలను సృష్టించి, అదేమంటే మంచితనమే ధర్మమని కథలు అల్లి బుద్ధ గౌతముణ్ణి కథానాయకణ్ణి చేసి. విగ్రహారాధనను గేలి చేసిన వాడికే మిన్నెత్తు విగ్రహాలు కట్టి. బుద్ధ దేవుని సృష్టించి ….
…. ఆత్మలేని కర్మ. మోక్షం కాని నిర్వాణం. ఇదీ బుద్ధ జీవుల నిర్వాకం.
ఇట్లు,
మీ అజ్ఞేయవాది